చాట్‌జీపీటీ సాయంతో పరీక్ష రాస్తూ పట్టుబడి విద్యార్థి ఆత్మహత్య
ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) బాంబేలో విషాదం చోటుచేసుకుంది. పరీక్ష హాల్లో మొబైల్ ఫోన్ వాడుతూ దొరికిపోయిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో ఆగ్రహించిన విద్యార్థులు క్యాంపస్‌లో భారీ నిరసనకు దిగడంతో యాజమాన్యం ప్రస్తుతం జరుగుతున్న మిడ్ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసింది.
- ఐఐటీ బాంబేలో విషాదం
ముంబై: ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) బాంబేలో విషాదం చోటుచేసుకుంది. పరీక్ష హాల్లో మొబైల్ ఫోన్ వాడుతూ దొరికిపోయిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో ఆగ్రహించిన విద్యార్థులు క్యాంపస్‌లో భారీ నిరసనకు దిగడంతో యాజమాన్యం ప్రస్తుతం జరుగుతున్న మిడ్ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసింది. ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన రెండవ సంవత్సరం విద్యార్థి శుక్రవారం జరిగిన మిడ్ సెమిస్టర్ పరీక్షకు హాజరయ్యాడు.
ఈ సందర్భంగా ప్రశ్న పత్రానికి సంబంధించిన సమాధానాల కోసం మొబైల్ ఫోనులో చాట్‌జీపీటీ ద్వారా సమాధానం వెదుకుతూ, ఇన్విజిలేటర్లకు పట్టుబడ్డాడు. అయితే అతనిపై ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా కౌన్సెలింగ్ ఇచ్చినట్లు సంబంధిత విభాగాధిపతి(హెచ్‌వోడీ) ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం పరీక్ష ముగిసిన తర్వాత ఆ విద్యార్థి హాస్టల్-4లోని తన గదికి వెళ్లి, రాత్రి ఉరివేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోవై పోలీసులు విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజావాడి దవాఖానకు తరలించి, కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో క్యాంపస్‌లో ఉద్రిక్తత నెలకొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

