టాస్క్-డెల్ టెక్నాలజీల మధ్య ఎంవోయూ
యువతకు ఫ్యూచర్ రెడీ టెక్నాలజీ స్కిల్స్, ఉపాధి అవకాశాలు పెంపొందించడమే లక్ష్యంగా ‘ఉడాన్' ప్రోగ్రామ్‌లో భాగంగా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్), డెల్ టెక్నాలజీస్ మధ్య ఎంవోయూ కుదిరింది. శనివారం సచివాలయంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో టాస్క్, డెల్ టెక్నాలజీస్ ప్రతినిధులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..
- 25 సెంటర్లలో 5,500 మందికి శిక్షణ
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : యువతకు ఫ్యూచర్ రెడీ టెక్నాలజీ స్కిల్స్, ఉపాధి అవకాశాలు పెంపొందించడమే లక్ష్యంగా ‘ఉడాన్’ ప్రోగ్రామ్‌లో భాగంగా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్), డెల్ టెక్నాలజీస్ మధ్య ఎంవోయూ కుదిరింది. శనివారం సచివాలయంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో టాస్క్, డెల్ టెక్నాలజీస్ ప్రతినిధులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఈ ఒప్పందంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 25 కేంద్రాల్లో 5,500 మంది విద్యార్థులకు మూడు నెలలపాటు శిక్షణ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. కృత్రిమ మేధ(ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్, ఎలక్ట్రానిక్స్ తయారీ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, డిజిటల్ నైపుణ్యాలు అందించనున్నామని వివరించారు. డెల్ టెక్నాలజీస్ సాంకేతికత మద్దతు, ఐఐటీ ఢిల్లీ అభివృద్ధి చేసిన సిలబస్‌తో ఈ శిక్షణ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి, స్టేట్ కౌన్సిల్ సెక్రటరీ రామ్, టాస్క్ సీఈవో నితిన్ కుమార్‌రెడ్డి, సీవోవో రాఘవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

