యువతరం ప్రేమకథగా తెరెక్కుతున్న చిత్రం ‘సంగీత్’. నిఖిల్ విజయేంద్రసింహా కథానాయకుడు. తేజు అశ్విని కథానాయిక. సాద్‌ఖాన్ దర్శకత్వంలో నవీన్ మనోహరన్, చంద్రు మనోహరన్, స్రవంతి నవీన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నది. మ్యూజిక్ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి తొలి పాటగా ‘నీవల్లే..’ అని సాగే రొమాంటిక్ మెలొడీని మేకర్స్ విడుదల చేశారు. విక్రమ్ శివ రాసిన ఈ పాటను అచు రాజామణి స్వరపరచగా, సిద్ శ్రీరామ్ ఆలపించారు.
ప్రేమ, భావోద్వేగాలను ఈ పాట అద్భుతంగా ఆవిష్కరించిందని, ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ పాట విశేష ఆదరణ పొందుతున్నదని మేకర్స్ చెబుతున్నారు. హీరో నిఖిల్ విజయేంద్రసింహా, తేజు అశ్విని మధ్య కెమిస్ట్రీ ఈ పాటకు హైలైట్‌గా నిలుస్తుందని వారన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ గంగాధరి, సమర్పణ: జి.మనోహరన్ అండ్ ఎల్.బాలకృష్ణ, నిర్మాణం: లహరి ఫిల్మ్స్ అండ్ ఆర్బీ స్టూడియోస్.