లక్నో: రోడ్డు దాటుతున్న గుర్రాన్ని బైక్‌పై వెళ్తున్న వ్యక్తి వేగంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదం ధాటికి ఆ గుర్రం ఎగిరి రోడ్డుపై పడి మరణించింది. (Horse Bike Collision) అదృష్టవశాత్తు బైకర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జూన్ 11న కౌశాంబి జిల్లాలోని హైవేపై ఊహించని ప్రమాదం జరిగింది. ఒక గుర్రం రోడ్డును దాటేందుకు ప్రయత్నించింది. ఇంతలో బైక్‌పై వేగంగా దూసుకొచ్చిన వ్యక్తి దానిని ఢీకొట్టాడు.
కాగా, ప్రమాదం ధాటికి గుర్రం గాలిలోకి ఎగిరింది. కాస్త దూరంగా రోడ్డుపై పడింది. అది అక్కడికక్కడే మరణించింది. అయితే గుర్రాన్ని ఢీకొట్టిన బైక్ అదుపుతప్పి రోడ్డుపై పల్టీకొట్టింది. అదృష్టవశాత్తు బైకర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. అతడు వెంటనే పైచి లేచి రోడ్డు పక్కకు చేరుకున్నాడు. స్థానికులు సహాయం కోసం ముందుకు వచ్చారు. రోడ్డు మధ్యలో పడి ఉన్న బైక్‌ను పక్కకు తరలించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
जाको राखे साइया मार सके ना कोय। यह कहावत एक हादसे के दौरान फिर सच साबित हुई है। दरअसल संदीपन घाट थाना इलाके के मूरतगंज रोड पर एक युवक बाइक से जा रहा था तभी उसके सामने एक जानवर (घोड़ा) आ गया। बाइक सवार युवक की जानवर से जोरदार टक्कर हुई लेकिन बाइक सवार युवक को खरोच तक नही आई।
इस… pic.twitter.com/s5yrSealwW
— Ashish Paswan (@ashishpaswan0) June 13, 2025
Also Read:
సిందూర్ సమయంలో వణికిన వరుడి చేయి.. పెళ్లి రద్దు చేసిన వధువు
రూ.20 లక్షల నగల బ్యాగ్‌ను లాక్కెళ్లిన కోతి.. తర్వాత ఏం జరిగిందంటే?
‘లొంగిపోను, చచ్చిపోతా’.. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నేరస్తుడు ఏం చేశాడంటే?