అహ్మదాబాద్: మోస్ట్ వాంటెండ్ క్రిమినల్ పోలీసులకు చుక్కలు చూపించాడు. కళ్లగప్పి తిరుగుతున్న అతడ్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే ఎత్తైన బిల్డింగ్ ఐదో అంతస్తు ఎడ్జ్‌కు చేరుకున్నాడు. ‘లొంగిపోను, చచ్చిపోతా’ అని బెదిరించాడు. (Better to die than surrender) చివరకు ఫైర్ సిబ్బంది సహాయంతో ఆ నేరస్తుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. పలు కేసుల్లో వాంటెడ్ క్రిమినల్ అయిన అభిషేక్ అలియాస్ ‘షూటర్’ చాలా కాలంగా అరెస్టు నుంచి తప్పించుకున్నాడు. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అతడి కోసం వెతుకుతున్నారు.
కాగా, శివమ్ ఆవాస్‌లోని అపార్ట్మెంట్లో అభిషేక్ ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో శనివారం క్రైమ్ బ్రాంచ్ బృందం అక్కడకు చేరుకున్నది. పోలీసులను చూసిన అభిషేక్ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. బిల్డింగ్ ఐదో అంతస్తులోని గట్టుపైకి చేరుకున్నాడు. ‘నాతో ఎలా ప్రవర్తిస్తారో నాకు తెలుసు. అది నిజంగా దారుణంగా ఉంటుంది. లొంగిపోవడం కంటే చనిపోవడం మేలు. కిందకు దూకేస్తా ’ అని బెదిరించాడు. పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ అక్కడి నుంచి పైకి రాలేదు. తన మొబైల్లో లైవ్ స్ట్రీమింగ్ చేశాడు.
మరోవైపు స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడారు. చివరకు పోలీసులు ఫైర్ సిబ్బందిని రప్పించారు. వలల సహాయంతో అభిషేక్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సుమారు మూడు గంటలపాటు సాగిన ఈ హైడ్రామాకు సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
When the team of City Crime Branch in Ahmedabad, Gujarat reached to arrest a criminal, he started threatening to jump in the style of the movie Sholay. The Crime Branch had to work hard to arrest Abhishek alias Shooter AK 47. pic.twitter.com/NV4wsH61tM
— Mohd Nadeem Siddiqui🇮🇳 (@nadeemwrites) June 7, 2025
#Ahmedabad :A man wanted by police climbed to the 5th floor of an apartment to evade arrest.Threatened to jump if anyone approached. Locals filmed the drama. Cops & fire team rushed in—took 3 hours to take him down. He’s now in custody.@NewIndianXpress @santwana99 @jayanthjacob pic.twitter.com/8FanNKAblr
— Dilip Kshatriya (@Kshatriyadilip) June 7, 2025
Also Read: