లక్నో: జీన్స్, టీ షర్టు ధరించిన అమ్మాయిలు రోడ్డుపై అడుక్కుంటున్నారు. (Girls in jeans seeking alms) స్థితిమంతులుగా కనిపించినప్పటికీ వారు భిక్షాటన చేయడం చూసి వాహనదారులు, స్థానికులు షాక్ అయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ నుంచి వచ్చి అడుక్కోవడంపై దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఐదుగురు అమ్మాయిలు జీన్స్, టీ షర్టులు ధరించారు. చూడటానికి ఉన్నత కుటుంబాలకు చెందిన వారిగా కనిపించారు. బల్లియాలోని రైల్వే స్టేషన్, కీలక కూడళ్లు, రోడ్లపై అడుక్కుంటున్నారు. కార్డును చూపించి వాహనదారులు, పాదాచారులను డబ్బులు అడుగుతున్నారు. రూ.10కు చిన్న బుక్లెట్స్ కూడా అమ్ముతున్నారు.
Girls Hail From Gujarat,
కాగా, చక్కగా దుస్తులు ధరించిన యువతులు భిక్షాటన చేయడం గురించి పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. మహిళా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అమ్మాయిల ఆధార్‌కార్డులను పరిశీలించి గుజరాత్‌కు చెందిన వారని పోలీసులు తెలుసుకున్నారు.
మరోవైపు ఈ అమ్మాయిలు బల్లియా రైల్వే స్టేషన్ సమీపంలోని సత్రంలో ఉంటున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. వారు తమ ఇళ్ల నుంచి పారిపోయి వచ్చారా? 1400 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుజరాత్ నుంచి బల్లియాకు ఎందుకు వచ్చారు? ఇక్కడ ఎందుకు అడుక్కుంటున్నారు? అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
बलिया जिले में सुखपुरा थाना क्षेत्र से पांच लड़कियों को पुलिस ने हिरासत में लिया गया है. ये लड़कियां जींस और टी-शर्ट पहनकर भीख मांग रही थीं और एक किताब भी बेच रही थीं. पुलिस के अनुसार, ये सभी गुजरात की रहने वाली हैं.#Ballia pic.twitter.com/L6pKuAW4Pq
— Ratnesh Singh (News18 up) (@ratneshballiya) June 5, 2025
Also Read: