డెహ్రాడూన్: పర్యాటకులతో వెళ్తున్న హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో హైవేపై అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. (Chopper Emergency Landing) పైలట్‌తోపాటు టూరిస్టులు సురక్షితంగా బయటపడ్డారు. అయితే పార్క్ చేసిన కారుతోపాటు పలు షాపులు ధ్వంసమయ్యాయి. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం బదాసు (సిర్సాయి) నుంచి కేదార్‌నాథ్‌కు వెళ్తున్న ప్రైవేట్ హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో గుప్త్ కాశిలోని రోడ్డు మధ్యలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.
కాగా, అదృష్టవశాత్తూ పైలట్, అందులో ఉన్న ఐదుగురు పర్యాటకులు సురక్షితంగా బయటపడ్డారు. అయితే హెలికాప్టర్ రెక్కల వల్ల రోడ్డు పక్కన ఆగి ఉన్న కారు, అక్కడున్న షాపులు ధ్వంసమయ్యాయి. ఉత్తరాఖండ్ పౌర విమానయాన అభివృద్ధి అథారిటీ ఈ సంఘటన గురించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు సమాచారం ఇచ్చింది. మరోవైపు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Guptkashi, Nr Rudraprayag, Helicopter makes an emergency Landing on Highway 😳😳#Uttarakhand #Rudraprayagpic.twitter.com/CfRfObQVl3
— My Vadodara (@MyVadodara) June 7, 2025
Also Read: