Hospital Staff | రాజస్థాన్ (Rajasthan)లో అమానుష ఘటన వెలుగు చూసింది. ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీ (ESIC Medical College)లోని ఐసీయూ వార్డు (ICU Ward)లో చికిత్స పొందుతున్న 32 ఏళ్ల మహిళపై నర్సింగ్ సిబ్బంది (Hospital Staff) అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈనెల 4వతేదీన రాత్రి జరిగిన ఈ ఘటన తాజాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్ వివరాల ప్రకారం.. 32 ఏళ్ల మహిళ ఐసీయూ వార్డులో చికిత్స పొందుతోంది. ఆమె కుటుంబ సభ్యులు వార్డు బయట వేచి ఉన్నారు. ఆ సమయంలో అక్కడి నర్సింగ్ స్టాఫ్ ఒకరు మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె పడుకున్న మంచం చుట్టూ కర్టెన్స్ వేసి.. ఆమెకు మత్తు మందు ఇచ్చాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు స్పృహలోకి వచ్చాక ఈ దారుణాన్ని కుటుంబ సభ్యులకు వివరించింది. దీంతో వారు ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించగా.. ఆ ఆరోపణలు వారు ఖండించారు. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు అల్వార్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ మహవీర్ సింగ్ తెలిపారు.
Also Read..
Virat Kohli | బెంగళూరు తొక్కిసలాట.. విరాట్ కోహ్లీపై పోలీసులకు ఫిర్యాదు