న్యూఢిల్లీ: కేవలం 180 మీటర్ల దూరంలో ఉన్న ఇంటికి వెళ్లేందుకు ఒక మహిళ బైక్ బుక్ చేసింది. అక్కడకు చేరుకున్న రైడర్ ఇది తెలుసుకుని షాక్ అయ్యాడు. కుక్కల భయం వల్ల తాను ఇలా చేసినట్లు ఆమె చెప్పింది. దీంతో ఆ యువతిని బైక్‌పై ఆమె ఇంటికి చేర్చాడు. (Woman Books Ride For 180 Metres) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వీధి కుక్కల భయం వల్ల ఒక యువతి వినూత్నంగా ఆలోచించింది. కేవలం 180 మీటర్ల దూరంలో ఉన్న ఇంటికి చేరేందుకు ఓలా బైక్ బుక్ చేసింది. రైడర్ ఆమె వద్దకు చేరుకున్నాడు. ఓటీపీ అడిగిన తర్వాత ఆ మహిళ ఎంత దూరం ప్రయాణించాలి అన్నది గూగుల్ మ్యాప్‌లో చూశాడు. కేవలం 180 మీటర్ల దూరం అని తెలిసి షాక్ అయ్యాడు. రైడ్ గురించి ఆ మహిళను కన్ఫార్మ్ చేసుకున్నాడు.
కాగా, కుక్కల భయం వల్ల తాను బైక్ బుక్ చేసినట్లు ఆ యువతి చెప్పింది. దీంతో ఎలాంటి వాదన లేకుండా ఆమెను బైక్ ఎక్కించుకున్నాడు. మూడు చిన్న మలుపులు ఉన్న గమ్యస్థానానికి రెండు నిమిషాల్లో చేర్చాడు. అయితే దారిలో ఒక కుక్క కూడా కనిపించలేదు. ఒక చోట ఆవులు విశ్రాంతి తీసుకుంటున్నాయి.
మరోవైపు నడిచి వెళ్లగల ఈ చిన్న దూరం బైక్ రైడ్ కోసం ఆ యువతి రూ.19 చెల్లించింది. బైక్ రైడర్ ఇదంతా వీడియో రికార్డ్ చేశాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఈ వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. కుక్కలు ఎక్కడా కనిపించలేదని ఒకరు, కుక్క వ్యక్తికి కమిషన్ ఇవ్వాలని మరొకరు చమత్కరించారు.
Also Read: