Viral Video | హనుమకొండలోని ఎక్సైజ్ కాలనీలో శుక్రవారం ఉదయం చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా ఓ మహిళ మెడలో నుంచి.. బంగారు గొలుసు లాక్కొని ఇద్దరు దుండగులు బైక్పై పారిపోయారు.
ఈ ఘటనతో బాధితురాలు మామిండ్ల నవ్య ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. దొంగలను పట్టుకునేందుకు బైక్ వెనుక కొద్దిదూరం ఆమె పరిగెత్తింది. కానీ లాభం లేకుండాపోయింది. ఈ చోరీపై బాధితురాలు నవ్య.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని వివరాలను సేకరించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. అందులో నవ్య మెడలో నుంచి గోల్డ్ చైన్ లాక్కెళ్లడం, వారి వెంట నవ్య పరిగెత్తడం స్పష్టంగా రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.
సీసీటీవీ ఫుటేజ్
హన్మకొండలోని ఎక్సైజ్ కాలనీలో చెయిన్ స్నాచింగ్ కలకలం
ఉదయం ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా మహిళ మెడలోని బంగారు చెయిన్ లాక్కుని బైక్ పై పారిపోయిన దుండగులు
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు మామిండ్ల నవ్య
సీసీటీవీ ఆధారంగా దుండగుల కోసం గాలిస్తున్న పోలీసులు pic.twitter.com/oHiGJcmsDo
— Telugu Scribe (@TeluguScribe) March 6, 2026