లక్నో: పసి బాలికను ఒక వ్యక్తి కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 24 గంటల్లోనే నిందితుడు ఎన్కౌంటర్లో మరణించాడు. (Rape Accused Killed In Encounter) ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. అలంబాగ్ ప్రాంతంలోని చందానగర్ మెట్రో స్టేషన్ సమీపంలో నివసించే కుటుంబానికి చెందిన రెండున్నర ఏళ్ల బాలిక గురువారం ఉదయం అదృశ్యమైంది. వెతికిన తల్లిదండ్రులు మెట్రో వంతెన కింద అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారిని గమనించారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారణ అయ్యింది.
కాగా, బాలిక తల్లిదండ్రులు అలంబాగ్ పోలీస్ స్టేషన్లో పోలీసు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆ ప్రాతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. నిందితుడిని దీపక్ వర్మగా పోలీసులు గుర్తించారు. అతడి స్కూటర్ నంబర్ ఆధారంగా వివరాలు తెలుసుకున్నారు. నిందితుడి అరెస్టు కోసం లక్ష రివార్డు కూడా ప్రకటించారు.
మరోవైపు శుక్రవారం తెల్లవారుజామున కంటోన్మెంట్‌లోని దేవి ఖేడా ప్రాంతంలో నిందితుడు దీపక్ వర్మ ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు అక్కడకు చేరుకున్నారు. లొంగిపోవాలని ఆదేశించగా అతడు కాల్పులు జరిపినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నిందితుడ్ని ఆసుపత్రికి తరలించగా అక్కడ చనిపోయినట్లు చెప్పారు. నేరాలకు పాల్పడే దీపక్ వర్మపై పలు పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.
#WATCH | Lucknow, UP | Accused in the rape of a three-year-old who had a reward of Rs. 1 lakh on him, was injured in an exchange of fire with the police
(Visuals from the encounter spot) pic.twitter.com/KtCP7h3apM
— ANI (@ANI) June 5, 2025
Also Read: