Hrithik Roshan | పిల్లల ప్రేమ ముందు ఏ విజయం పనికిరాదు.. హృతిక్ రోషన్ ఎమోషనల్
Hrithik Roshan | బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తన పిల్లల్ల గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Hrithik Roshan On Fatherhood | బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తన పిల్లల్ల గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న హృతిక్ రోషన్, తన సినీ కెరీర్లో ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకున్నప్పటికీ, తండ్రిగా తన పిల్లలతో గడిపే సమయమే తనకు అత్యంత విలువైనదని పేర్కొన్నాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గోన్న ఆయన మాట్లాడుతూ.. ఒక నటుడిగా తాను అందుకున్న అవార్డులు, స్టార్డమ్ లేదా ఇతర విజయాలేవీ తన కుమారులు హ్రిదాన్, హ్రెహాన్ పట్ల తనకున్న ప్రేమతో సరితూగవని హృతిక్ వెల్లడించాడు. తన పిల్లల ఎదుగుదలను చూడటం, వారితో కలిసి ప్రయాణాలు చేయడం మరియు వారి సందేహాలకు సమాధానాలు వెతకడమే తన జీవితంలో అతిపెద్ద అచీవ్మెంట్ అని ఆయన అభివర్ణించాడు. తనకు ఎన్ని బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ, పిల్లల కోసం సమయాన్ని కేటాయించడం తన మొదటి ప్రాధాన్యత అని, వారిని ఒక మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దడమే తన అంతిమ లక్ష్యమని హృతిక్ అన్నాడు.
హృతిక్ తన మాజీ భార్య సుసానే ఖాన్‌తో విడిపోయినప్పటికీ, పిల్లల పెంపకం విషయంలో మాత్రం ఇద్దరూ కలిసి (Co-parenting) బాధ్యతలను పంచుకుంటున్నారు. హృతిక్ తన సోషల్ మీడియా ఖాతాలలో తరచూ తన కుమారులతో కలిసి వెకేషన్లకు వెళ్ళిన ఫోటోలను, వారితో కలిసి చేసే అడ్వెంచర్లను పంచుకుంటూ ఉంటాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

