లక్నో: పోలీస్ అధికారిణి అక్రమార్జన వెలుగులోకి వచ్చింది. 14 ఏళ్లలో సుమారు రూ.11 కోట్ల ఆస్తులు ఆమె కూడబెట్టినట్లు దర్యాప్తులో తెలిసింది. (Woman Cop illegal assets) దీంతో అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయడంతోపాటు ఆ పోలీస్ అధికారిణిని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. ప్రస్తుతం బరేలీలోని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్‌లో ఇన్స్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న నర్గీస్ ఖాన్, గతంలో మీరట్‌లో పలుసార్లు పనిచేసింది. గత14 ఏళ్ల పోలీస్ సర్వీస్‌లో రూ.10.59 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించింది. మీరట్‌లో ఇళ్ళు, ప్లాట్లు, రెస్టారెంట్లు, బార్లు, షాపులు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, పెట్రోల్ బంకులతోపాటు ఘజియాబాద్, నోయిడాలో ఫ్లాట్లు, ప్లాట్లు, బార్లు, పెట్రోల్ బంకులను కొనుగోలు చేసింది.
కాగా, పోలీస్ అధికారిణి నర్గీస్ ఖాన్ తన ఆదాయానికి మించి 97.55 శాతం అధికంగా సంపాదించింది. ఆమె భర్త సురేష్ కుమార్‌కు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నేతలతో సంబంధాలున్నాయి. దీంతో ఎస్పీ ప్రభుత్వ హయాంలో సొంత ఇష్టంతో మీరట్‌లో పలు పోస్టింగ్‌లను పొందింది.
మరోవైపు 2007 జనవరి 1 నుంచి 2021 మార్చి 31 మధ్య అక్రమంగా రూ.10.59 కోట్ల విలువైన ఆస్తులను నర్గీస్ ఖాన్ కూడబెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో 2021లో ఫిర్యాదు అందడంతో అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. ఆమెకు నోటీసులు జారీ చేయడంతోపాటు ఆదాయం, ఖర్చులు, బ్యాంకు ఖాతాలు, ఆస్తి లావాదేవీల రికార్డులను అధికారులు సేకరించారు. అక్రమ సంపాదన నిర్ధారణ కావడంతో ఆ పోలీస్ అధికారిణిని అరెస్ట్ చేశారు.
Also Read: