లక్నో: ఫుడ్ డెలివరీ ఏజెంట్ ముసుగులో ఒక వ్యక్తి ఆయుధాలను అక్రమంగా సరఫరా చేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు బైక్‌పై వెళ్తున్న అతడ్ని అడ్డుకున్నారు. ఫుడ్ డెలివరీ బ్యాగ్‌ను తనిఖీ చేసి షాక్ అయ్యారు. అందులో ఉన్న పిస్టల్స్, కార్ట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్నారు. (Pistols With Delivery Agent) ఉత్తరప్రదేశ్‌లోని ముజాఫర్‌నగర్‌లో ఈ సంఘటన జరిగింది. ఒక యువకుడు ఆయుధాలను అక్రమంగా సరఫరా చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో జమాల్పూర్ కాలువ కల్వర్ట్ సమీపంలో వాహనాలను తనిఖీ చేశారు.
కాగా, ఫుడ్ డెలివరీ బాయ్ గెటప్‌లో ఉన్న 22 ఏళ్ల సుధాన్షు బైక్‌పై అక్కడి నుంచి వేగంగా వెళ్లేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అతడ్ని అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఫుడ్ డెలివరీ బ్యాగ్‌లో ఉన్న పది కంట్రీ మేడ్ పిస్టల్స్, కార్ట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు సుధాన్షును పోలీసులు ప్రశ్నించారు. హర్యానాలోని కర్నాల్ జిల్లాలో ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ ఏజెంట్‌గా నిందితుడు నమ్మిస్తున్నాడని పోలీస్ అధికారి తెలిపారు. ఈ ముసుగులో హర్యానా, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో అక్రమంగా ఆయుధాలు సరఫరా చేస్తున్నాడని చెప్పారు.
కాగా, సుధాన్షు ఆయుధాలను ఎవరి నుంచి కొనుగోలు చేస్తున్నాడు, ఎవరికి సరఫరా చేస్తున్నాడు అన్న దానిపై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. అలాగే సుధాన్షు ఇచ్చిన సమాచారం ఆధారంగా అతడి మాదిరిగా ఆయుధాలను అక్రమంగా సరఫరా చేస్తున్న మరికొందరిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు.
Also Read: