Medak | మెదక్ గురుకులాల్లో నాసిరకం భోజనం.. విద్యార్థులు అస్వస్థతపై తల్లిదండ్రుల ఆందోళన
Medak | మెదక్ జిల్లాలోని ప్రభుత్వ మైనార్టీ గురుకుల పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకులాలు, వసతిగృహాలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Medak | మెదక్, మార్చి 10(నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలోని ప్రభుత్వ మైనార్టీ గురుకుల పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకులాలు, వసతిగృహాలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజూ అందించే అన్నం, కూరలు నాసిరకంగా ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల సరిగా ఉడకని అన్నం, రుచిలేని కూరలతో భోజనం పెడుతున్నారని విద్యార్థులు చెబుతున్నారు.
గురుకులాల్లో విద్యార్థులకు పోషకాహారం అందించాలని నిబంధనలు ఉన్నప్పటికీ, అమలు మాత్రం సరిగ్గా జరగడం లేదని విమర్శలు వస్తున్నాయి. కొంతమంది నిర్వాహకులు, సిబ్బంది తక్కువ ఖర్చుతో నాసిరకం సరుకులు తెచ్చి భోజనం తయారు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో గురుకులాలు, వసతిగృహాల్లో అవినీతి అక్రమాలు పెరుగుతున్నాయని తల్లిదండ్రులు, ప్రజలు అంటున్నారు.
గురుకులాల్లో బాధ్యతగా పనిచేయాల్సిన కొందరు అధికారులు కూడా ఈ అక్రమాలను పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థుల సంక్షేమాన్ని పక్కనబెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి గురుకులాలు, వసతిగృహాల్లో పరిస్థితులను సమీక్షించి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రేగోడు కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాల, నర్సాపూర్ లోని మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులు ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. జిల్లా అధికారులు సంక్షేమ వసతి గృహాల్లో జరుగుతున్న అవినీతి అక్రమ లపై క్షేత్రస్థాయిలో విచారణ చేసి బాధ్యులపై చర్య తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

