Trisha | తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ పేరు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత త్రిష పేరు తరచూ ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ క్రిప్టిక్ పోస్ట్ ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ఎవరినీ నేరుగా ప్రస్తావించకుండా, పరోక్షంగా ఎవరికో కౌంటర్ ఇచ్చేలా త్రిష చేసిన వ్యాఖ్యలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. త్రిష తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ కొటేషన్‌ను షేర్ చేశారు. “ఈ వయసులో అనవసరమైన డ్రామాలు చేయడం సిగ్గుచేటు.. వెళ్లి కొంత డబ్బు సంపాదించండి.. ప్రశాంతంగా జీవించండి” అనే అర్థం వచ్చేలా ఆమె పోస్ట్ చేశారు. దీంతో అసలు త్రిష ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ మొదలైంది.
అంతేకాకుండా “ఒకప్పుడు మనం ప్రార్థించిన జీవితం ఇప్పుడు మనకు లభించడం ఎంతటి అదృష్టం” అనే మరో కొటేషన్‌ను కూడా ఆమె పంచుకున్నారు. ఈ రెండు పోస్టులను కలిపి చూస్తున్న నెటిజన్లు.. త్రిష ప్రస్తుతం తనపై వస్తున్న విమర్శలు, వివాదాలకు పరోక్షంగా సమాధానం ఇచ్చారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. తన పోస్టులో ఎవరినీ నేరుగా ప్రస్తావించలేదు. కాబట్టి ఆమె వ్యాఖ్యలు ఏ వివాదానికి సంబంధించినవో, ఎవరికి కౌంటర్‌గా పెట్టారో అధికారికంగా స్పష్టత లేదు.
ఇక తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి నుంచి త్రిష పేరు ఆయనతో ముడిపెట్టి సోషల్ మీడియాలో అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇటీవల విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో త్రిష తాజా పోస్ట్ ఎవరిని ఉద్దేశించి చేసిందనే దానిపై సోషల్ మీడియాలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం ఇదే ప్రధాన చర్చగా మారింది. ఇటీవలి రాజకీయ వివాదాలకు త్రిష స్పందించారా? తనపై వస్తున్న నెగెటివ్ కామెంట్లకు సమాధానమిచ్చారా? లేక పూర్తిగా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశంపై ఈ పోస్టు చేశారా? అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా.. ఎలాంటి పేరు చెప్పకుండా త్రిష పెట్టిన ఈ రెండు క్రిప్టిక్ పోస్టులు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో “త్రిష ఎవరిని టార్గెట్ చేశారు?” అనే ప్రశ్నకు సమాధానం కోసం అభిమానులు, నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.