Giorgia Meloni | ఇటలీ స్కూళ్లలో బుర్కా, నికాబ్‌పై నిషేధం.. ప్రకటించిన ఇటలీ ప్రధాని జార్జియో మెలోని
Giorgia Meloni : ఇటలీ స్కూళ్లలో విద్యా విధనం విషయంపై ఆ దేశ ప్రధాని జార్జియా మెలోని కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా విదేశీ విద్యార్థులకు ప్రవేశం విషయంలో సంచలన ప్రతిపాదన చేశారు.
Giorgia Meloni : ఇటలీ స్కూళ్లలో విద్యా విధనం విషయంపై ఆ దేశ ప్రధాని జార్జియా మెలోని కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా విదేశీ విద్యార్థులకు ప్రవేశం విషయంలో సంచలన ప్రతిపాదన చేశారు. దేశంలోని స్కూళ్లలో బుర్కా, నికాబ్ నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇటలీ రాజధాని రోమ్‌లో బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పేరుతో జరిగిన పార్టీ కార్యక్రమంలో మెలోని దీనిపై ప్రకటన చేశారు. దీని ప్రకారం విదేశీ విద్యార్థులు ఇటలీ స్కూళ్లలో చదువుకోవాలంటే అక్కడి నిబంధనల్ని పాటించాల్సిందే.
విదేశాల నుంచి వచ్చిన వారి పిల్లలు స్కూళ్లలో చదవాలంటే.. వారి తల్లిదండ్రులు ఇటలీ సంస్కృతి, భాషను అర్థం చేసుకోవాలి. ఇందుకోసం పేరెంట్స్ ఇటలీ లాంగ్వేజ్ క్లాసులకు హాజరు కావాలి. ఇదే సమయంలో స్కూళ్లలో విద్యార్థులు బుర్కా, నికాబ్ ధరించడాన్ని నిషేధించబోతున్నారు. ఈ ప్రతిపాదనలు పార్లమెంట్లో ఆమోదం పొంది, చట్టంగా మారేందుకు కనీసం 60 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ప్రపంచంలోని 24 ముస్లిమేతర దేశాల్లో ఇప్పటికే బుర్కా, నికాబ్లపై నిషేధం అమలవుతోంది.
చైనా, ఫ్రాన్స్ దేశాలు ఈ నిబంధనను ఎప్పటినుంచో అమలు చేస్తున్నాయి. వచ్చే ఏడాది ఇటలీ పార్లమెంట్‌కు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా విద్యార్థులకు సంబంధించి మూడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవి.. ముఖం కనిపించకుండా చేసే బుర్కా, నికాబ్ వంటివాటిని స్కూళ్లలో నిషేధిస్తారు. ఇవి ఎక్కువగా ముస్లింలు ధరిస్తారు. అయితే, హిజాబ్‌పై మాత్రం ఎలాంటి నిషేధాన్ని ప్రకటించలేదు. అలాగే, విదేశాల నుంచి ఇటలీకి చదువుకోవడానికి వచ్చే విద్యార్థులు ఇటలీ సంస్కృతిని గౌరవించాలి. ఇటలీ భాష నేర్చుకోవాలి. ఇటలీలోని స్కూళ్లు, కాలేజీలలో విదేశీ విద్యార్థుల సంఖ్యకు పరిమితులు విధిస్తారు.
విద్యార్థుల తల్లిదండ్రులు ఇటలీ భాష నేర్చుకోవాలి. ఇక్కడి నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలి. వచ్చే ఏడాది ఎన్నికల్లో విజయం సాధించేందుకు.. ఇటలీ ప్రజల్ని ఆకట్టుకునేందుకు మెలోని ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారనే ప్రచారం ఉంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Burqa
- Italy
- Niqab
- PM Giorgia Meloni
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

