Jurala project | సాగు నీళ్ల కోసం ప్రాణాలు సైతం లెక్క చేయని రైతులు.. కన్నీళ్లు తెప్పిస్తున్న అన్నదాతల పోరాటం : వీడియో
Jurala project | సాగు నీళ్ల కోసం రైతుల తాపత్రయం కన్నీళ్లు తెప్పిస్తుంది. పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు.
మహబూబ్నగర్ : సాగు నీళ్ల కోసం రైతుల తాపత్రయం కన్నీళ్లు తెప్పిస్తుంది. పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. అమరచింత జూరాల కింద ఎడమ కాలువలకు నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో పోలీసు బలగాలు జూరాల ప్రాజెక్టు మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీన్ని నిరసిస్తూ రైతాంగం ఎలాగైనా సాగునీళ్లు కావాలని చెప్పి ఏకంగా ప్రాణాలకు తెగించి కాలువలోకి దిగి జూరాల రెగ్యులేటర్ కి చేరుకునేందుకు చేస్తున్న ప్రయత్నం తీవ్ర కలకలం రేపింది. మరోవైపు బీఆర్ఎస్ నాయకులు జూరాల ప్రాజెక్టుపై రైతులతో కలిసి ధర్నాకు పిలుపునిస్తే మాజీ మంత్రులతో సహా మాజీ ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు.
రహదారులను వదిలి పొలాల వెంబడి నడిచి..
మరోవైపు రైతులు పెద్ద ఎత్తున జూరాల ప్రాజెక్టుకు తరలి రావడానికి ప్రధాన రహదారులను వదిలి పొలాల వెంబడి కాళ్లు నడకన పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. పోలీసులు ప్రతిఘటించి అదుపులోకి తీసుకుంటున్న రైతాంగ మాత్రం సాగునీటి కోసం తీవ్ర ఆవేదన చెందుతుంది. ఈ లోపు జూరాల ఎడమ కాలువలోకి రైతులు దిగి ప్రాణాలకు తెగించి చేస్తున్న సాహసోపేతమైన పోరాటం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రతి ఒక్కరిని కదిలిస్తున్నది.
ఇదిలా ఉండగా ప్రభుత్వం ఇరిగేషన్ అధికారులు ఇప్పటివరకు నీటి విడుదలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రైతుల్లో అసహనం పెరుగుతోంది. మరోవైపు కోయిల్ సాగర్ కింద కూడా కాలువలకు నీళ్లు విడుదల చేయాలని.. సంగం బండ రిజర్వాయర్ కింద కూడా నీళ్లు విడుదల చేయాలని రైతాంగం డిమాండ్ చేస్తుండడంతో మరో నీటి పోరాటానికి తెర లేపుతోంది. అలాగే శ్రీశైలం ప్రాజెక్టులో సుమారు 100 టీఎంసీల వరకు నీళ్లు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఎత్తిపోయకుండా ఆంధ్రాకు నీళ్లు వెళ్లేలా చేస్తుంది. దీంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రైతులు తీవ్రంగా రగిలిపోతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhaskar Rao | సింగరేణి లాభాల తగ్గుదలపై సమగ్ర నివేదిక విడుదల చేయాలి : మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు
పంచాయతీ అధికారి పర్సంటేజీల దందా ?
Weight Loss Surgery | కౌమారదశలో ఉన్న వారికి బరువు తగ్గించే శస్త్ర చికిత్సలు అవసరమా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది..?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

