Narendra Modi Stadium | అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చిన అభిమానులకు స్టేడియం లోపల అమ్మిన వస్తువుల ధరలు షాక్‌కు గురిచేశాయి. బయట మార్కెట్లో కేవలం రూ. 20కే లభించే సాధారణ లీటర్ మంచినీళ్ల బాటిల్‌ను స్టేడియంలోని వెండర్లు ఏకంగా రూ. 200 నుంచి రూ. 300 వరకు విక్రయించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఒక అభిమాని మంచినీళ్ల బాటిల్ అడగగా, అక్కడి సిబ్బంది నిర్మొహమాటంగా రూ. 200 అని చెప్పడం ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురిచేసింది.
మరోవైపు స్టేడియంలో తాగునీరు ఉచితంగా అందుబాటులో ఉంచామని యాజమాన్యం చెబుతున్నప్పటికీ, ఎక్కడా నీటి సౌకర్యం కనిపించడం లేదని అభిమానులు ఆరోపించారు. ఫైనల్ మ్యాచ్ కావడంతో స్టేడియం కిక్కిరిసిపోవడం, భద్రతా కారణాల దృష్ట్యా బయటి నుంచి నీళ్ల బాటిళ్లను అనుమతించకపోవడాన్ని ఆసరాగా చేసుకుని విక్రేతలు అడ్డగోలుగా ధరలు పెంచేసినట్లు బాధితులు వాపోతున్నారు. కేవలం నీళ్లే కాకుండా, స్నాక్స్ మరియు కూల్ డ్రింక్స్ ధరలు కూడా సాధారణం కంటే మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువగా ఉండటంపై నెటిజన్లు మండిపడుతున్నారు. వేల రూపాయలు వెచ్చించి టికెట్లు కొని, భారీ ఖర్చుతో హోటళ్లు బుక్ చేసుకుని వచ్చిన తమకు కనీసం మంచినీటిని కూడా సరసమైన ధరలకు అందించకపోవడంపై క్రికెట్ ప్రేమికులు మేనేజ్మెంట్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
In other countries, when you go to watch sports, facilities like water are available for free, but in India, Rs 200 is charged for a bottle of Rs 10.
Our government also does not take any action against them. pic.twitter.com/WoJMJsJ7vU
— Honest Cricket Lover (@Honest_Cric_fan) March 10, 2026