Vivo V70 FE : చైనాకు చెందిన మొబైల్ బ్రాండ్ వివో నుంచి మరో ఫ్లాగ్షిప్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. వివో వీ70 ఎఫ్ఈ పేరుతో ఈ ఫోన్‌ను ఈ నెల 2న మార్కెట్లోకి తెచ్చింది. ఇప్పటికే వీ70 సిరీస్‌లో వీ70, వీ70 ఎలైట్ స్మార్ట్ఫోన్లు విడుదలైన సంగతి తెలిసిందే. 200 ఎంపీ కెమెరా, 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటివి వీ70 ఎఫ్ఈ ప్రత్యేకతలు. ఈ ఫోన్లోని కీలక ఫీచర్లివి.
6.83 అంగుళాల 1.5కే ఓలెడ్ డిస్ప్లే, 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్, 1900 పీక్ బ్రైట్నెస్, ఆక్టాకోర్ మీడియాటెక్ డిమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16 ఓఎస్, ఆరిజిన్ ఓఎస్ 6, 200 ఎంపీ మెయిన్ కెమెరా+8ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 50 ఎంపీ సెల్ఫీ కెమెరా, 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 90 వాట్స్ ఫ్లాష్ ఛార్జ్, 60 నిమిషాల్లోనే 1 నుంచి 100 శాతం ఛార్జింగ్, ఐపీ 68, ఐపీ 69 రేటింగ్, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్, ఏఐ ఫొటోగ్రఫీ సూట్ వంటి ఫీచర్లున్నాయి. 8జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ, 12జీబీ+256జీబీ వేరియెంట్లలో లభిస్తుంది. మాన్సూన్ బ్లూ, పర్పుల్ కలర్స్‌లో లభ్యం.
ధర వేరియెంట్‌ను బట్టి రూ.37,999 / రూ.40,999 / రూ.44,999. ఈ నెల 9 నుంచి వివో వెబ్‌సైట్‌తోపాటు ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌తో పాటు వివో టీడబ్ల్యూఎస్ 3ఈ హెడ్సెట్ కావాలంటే అదనంగా రూ.1,499 చెల్లిస్తే చాలు. ఫోన్ లాంఛింగ్ ఆఫర్ కింద డిస్కౌంట్లోనే ఈ హెడ్సెట్ లభిస్తుంది. వివిధ కార్డులపై డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా వర్తిస్తాయి.