Election Postpone | ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా..బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్ల ఆందోళన
Election Postpone | నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది.
ఖానాపూర్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ (Khanapur) మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా (Postpone) పడింది. శనివారం జరిగిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సంద్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు( MLA Vedma Bojju ) వాగ్వాదాంతో సమావేశం గందరగోళంగా మారడంతో అధికారులు చైర్మన్ ఎన్నికను వాయిదా వేశారు.
ఎన్నిక సందర్భంగా సమావేశంలో అధికారులు ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం అంకం మౌనిక అనే బీజేపీ కౌన్సిలర్ పేరు పిలవగా, ఆమెకు మద్దతుగా ఏడుగురు కౌన్సిలర్లు చేతులెత్తారు. దీంతో మొదట కాంగ్రెస్ అభ్యర్థి చిన్నం సత్యం పేరు పిలవాలని పోడియం వద్ద ఉన్న అధికారుల మీదకి ఎమ్మెల్యే దూసుకెళ్లి, వారితో వాగ్వాదానికి దిగడంతో అధికారులు ఎన్నికను వాయిదా వేశారు.
దీంతో సమావేశంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు ఆందోళనకు దిగి అధికారుల తీరును నిరసిస్తూ కార్యాలయంలోనే బైఠాయించి నినాదాలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే, అధికారుల తీరు దారుణంగా ఉందని అన్నారు.మున్సిపల్ కార్యాలయంలో నిరసన తెలుపుతున్న 8 వార్డ్ కౌన్సిలర్ బొప్పారపు సత్యవతి సొమ్మసిల్లి పడిపోయారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

