Stock Market | కోలుకున్న స్టాక్ మార్కెట్లు.. నేడు లాభాలతో ప్రారంభం
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) మళ్లీ కోలుకున్నాయి. చమురు సెగతో సోమవారం భారీ నష్టాలు చవిచూసిన మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఇంధన ధరలను నియంత్రించే చర్యల్లో భాగంగా చమురుపై ఉన్న కొన్ని రకాల ఆంక్షలను తొలగించనున్నామని అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించారు.
Stock Market : దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) మళ్లీ కోలుకున్నాయి. చమురు సెగతో సోమవారం భారీ నష్టాలు చవిచూసిన మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఇంధన ధరలను నియంత్రించే చర్యల్లో భాగంగా చమురుపై ఉన్న కొన్ని రకాల ఆంక్షలను తొలగించనున్నామని అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించారు. అలాగే యుద్ధం ముగింపు గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు, కనిష్ఠాల వద్ద కొనుగోళ్లు సెంటిమెంట్‌ను బలపరిచాయి.
దాంతో ప్రీ ఓపెనింగ్ సెషన్లో సెన్సెక్స్ 800 పాయింట్లు మేర ఎగబాకింది. ఉదయం 9.38 గంటల సమయంలో సెన్సెక్స్ 600కు పైగా పాయింట్ల లాభంతో 78,100 పాయింట్లపైన ఉండగా.. నిఫ్టీ 200 పాయింట్లకుపైగా పుంజుకుని 24,200 మార్కుపైన ట్రేడవుతోంది. అదేవిధంగా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 91.93గా ఉంది. నిఫ్టీ సూచీలో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, శ్రీరామ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
ఓఎన్జీసీ, రిలయన్స్, ఇన్ఫోసిస్, హిందాల్కో, టెక్ మహీంద్రా స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ సోమవారం ఒక బ్యారెల్‌కు 119 డాలర్ల వరకు పెరుగగా తాజాగా 89 డాలర్లకు పడిపోయింది. చమురు ధరలు తగ్గడంతో ఇండిగో, స్పైస్‌జెట్ షేర్లు 8 శాతం మేర పెరిగాయి. మరోవైపు ఆసియా మార్కెట్లు కూడా లాభాల్లోనే ట్రేడవుతున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

