జైపూర్: ఒక వీధిలో రెండు ఎద్దులు పోట్లాడుకున్నాయి. ఒక వృద్ధుడు వాటికి దగ్గరగా మెట్ల వద్ద ఉన్నాడు. ఆ ఎద్దులను తరిమేందుకు ప్రయత్నించాడు. అయితే ఒక్కసారిగా ఒక ఎద్దు అతడిపైకి దూసుకొచ్చింది. ఎద్దు దాడిలో కిందపడిన ఆ వృద్ధుడు మరణించాడు. (Elderly Man Killed By Fighting Bulls) ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాజస్థాన్లోని కోటాలో ఈ సంఘటన జరిగింది. మే 31న సుభాష్ నగర్ ప్రాంతంలో రెండు ఎద్దుల మధ్య ఫైట్ జరిగింది. సమీపంలోని షాపు మెట్ల వద్ద ఒక వృద్ధుడు నిల్చొని ఉన్నాడు. పోట్లాడుతున్న ఎద్దుల బారి నుంచి తనను తాను రక్షించుకునేందుకు ప్రయత్నించాడు.
కాగా, మెట్ల వద్ద ఉన్న వృద్ధుడిపైకి ఒక ఎద్దు దూసుకెళ్లింది. కొమ్ములతో బలంగా తోసేయడంతో అతడు మెట్లపై పడిపోయాడు. గమనించిన ఒక వ్యక్తి పరుగున వృద్ధుడి వద్దకు చేరుకున్నాడు. అక్కడున్న ఎద్దును అక్కడి నుంచి తరిమాడు. అయితే ఎద్దు దాడి వల్ల తీవ్ర బాధతో అల్లాడిన ఆ వృద్ధుడు చనిపోయాడు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
कोटा में सांडों की लड़ाई बना जानलेवा हादसा!#kota में दो सांडों की भयंकर भिड़ंत के दौरान एक बुजुर्ग की दुखद मौत हो गई।
हादसा उस वक्त हुआ जब एक सांड ने पास खड़े बुजुर्ग पर अचानक हमला कर दिया।
📹 वीडियो सोशल मीडिया पर तेजी से हो रहा वायरल… #Rajasthan #viral #trendingvideo pic.twitter.com/Mqwna6ERIB
— Vishwesh Tiwari (@VishweshTi92858) June 4, 2025
Also Read: