సకల జనుల సంక్షేమం కోసమే..ఉపవాస దీక్షలు
సకల జనుల సంక్షేమం కోసమే ఉపవాస దీక్షలు అని, రంజాన్ మాసం ముస్లింలకు పవిత్రమైనదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని సోమవారం జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో ఉపవాస దీక్ష చేస్తున్న ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ సమాజం లో సకల జనులు సుఖసంతోషాలతో సౌభాగ్యంగా ఉండాలని పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు కఠినమైన దీక్షలు చేస్తారని కొనియాడారు.
- రంజాన్ మాసం ముస్లింలకు పవిత్రమైనది
- పండుగలు శాంతి యుతంగా జరపాలి
- ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
వనపర్తి టౌన్, మార్చి 9 : సకల జనుల సంక్షేమం కోసమే ఉపవాస దీక్షలు అని, రంజాన్ మాసం ముస్లింలకు పవిత్రమైనదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని సోమవారం జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో ఉపవాస దీక్ష చేస్తున్న ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ సమాజం లో సకల జనులు సుఖసంతోషాలతో సౌభాగ్యంగా ఉండాలని పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు కఠినమైన దీక్షలు చేస్తారని కొనియాడారు. ఈ ఏడాది ఉగాది, రంజాన్ పండుగలు ఒకేసారి రావడం శుభసూచకమని పండుగలు ప్రజలలో ఐకమత్యాన్ని, సోదర భావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. హిందూ, ముస్లింలు పండుగలు శాంతియుతంగా ఐకమత్యంతో నిర్వహించుకొని మత సామరస్యాన్ని చాటాలని పిలుపునిచ్చారు.

Mahabubnagar
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ ప్రత్యూష..
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్వగృహ ంలో జరిగిన ఇఫ్తార్ విందులో రాష్ట్ర బీఆర్ఎస్ నాయకురాలు డాక్టర్ ప్రత్యూష పాల్గొని ముస్లింలకు పేరు పేరున అప్యాయంగా పలకరించి అతిథి మర్యాదలు చేస్తూ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మైనార్టీ అధ్యక్షుడు జోహెబ్ హుస్సేన్, గులాం ఖాదర్ ఖాన్, అరీఫ్, సమద్, సయ్యద్, జమిల్, సయ్యద్, జహంగీర్, ఇమ్రాన్, యూసుఫ్, ఏకే పాషా, ముద్దుసార్, నహీం, అస్లాం, ఇంతియాజ్, గట్టుయాదవ్, వాకిటీ శ్రీధర్, పలుస రమేశ్‌గౌడ్, నందిమల్ల అశోక్, కౌన్సిలర్ శ్రీఖర్గౌడ్, గంధం బాలపీరు, పరంజ్యోతి, వెంకట్‌సాగర్, చిట్యాల రాము, రాము తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

