కోల్‌కతా: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, న్యాయ విద్య విద్యార్థిని శర్మిష్ట పనోలి(Sharmishta Panoli)కి కోల్‌కతా హైకోర్టులో ఊరట లభించింది. ఆమెకు తాత్కాలిక బెయిల్ మంజూరీ చేశారు. వివాదాస్పద వీడియోను పోస్టు చేసిన నేపథ్యంలో ఆమెను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కోల్‌కతా పోలీసులు గురుగ్రామ్‌లో ఆమెను అరెస్టు చేశారు. వజాహత్ ఖాన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మత ఘర్షణలు రేకెత్తించేలా పనోలీ తన వీడియోలో కామెంట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆపరేషన్ సిందూర్‌పై బాలీవుడ్ ముస్లిం నటులను ఉద్దేశిస్తూ శర్మిష్ట తన వీడియోలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
బెయిల్ కోసం పదివేల పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. భావస్వేచ్ఛ, మత సామరస్యం లాంటి అంశాలపై చర్చ జరిగింది. శర్మిష్ట తన వీడియోను డిలీట్ చేసి క్షమాపణలు చెప్పింది. కానీ ఆమెపై విమర్శలు ఆగలేదు. రాజకీయంగా విమర్శలు వస్తున్నాయి. జూన్ 13వ తేదీ వరకు జుడిషియల్ కస్టడీలోకి ఆమెను తీసుకున్నారు. బెంగాల్లో ఆమెపై పలు చోట్ల నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదు అయినట్లు ఆమె తరపున లాయర్ పేర్కొన్నారు.