Virosh | నవదంపతులు ‘విరోష్’ జంట అభిమానుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండ-రష్మికల వివాహం అట్టహాసంగా జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్‌కి వచ్చిన ఈ జంట పలు కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. రీసెంట్గా తమ అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్లో ఫ్యాన్స్ కోసం ప్రత్యేక విందును ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ కార్యక్రమంలో విజయ్, రష్మిక ఇద్దరూ స్వయంగా దగ్గరుండి అభిమానులకు వివిధ రకాల వంటకాలు, స్వీట్లు వడ్డించారు. సాధారణంగా సెలబ్రిటీలు దూరంగా ఉంటారని భావించే పరిస్థితుల్లో, ఈ జంట మాత్రం ఫ్యాన్స్‌తో కలిసి కూర్చొని భోజనం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ, ఫొటోలు దిగుతూ ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించారు.
అంతేకాదు, కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరితో సెల్ఫీలు తీసుకుని, ఆటోగ్రాఫ్‌లు ఇచ్చి వారిని సంతోషంగా పంపించారు. ఈ హ్యాపీ మూమెంట్స్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానుల పట్ల తమకున్న అనుబంధాన్ని మరోసారి చాటుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా, ఈ రోజు సాయంత్రం హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో వీరి వివాహ రిసెప్షన్ ఘనంగా నిర్వహించనున్నారు. టాలీవుడ్ మాత్రమే కాకుండా బాలీవుడ్, ఇతర సినీ పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నారు. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఆహ్వానితుల జాబితాలో ఉన్నట్లు సమాచారం.
అయితే ఈ రిసెప్షన్‌కు హాజరయ్యే వారికి కఠినమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ముందస్తుగా ఆహ్వానం అందుకున్నవారికి, ప్రత్యేక కోడ్ ఉన్నవారికి మాత్రమే ప్రవేశం కల్పించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారని సమాచారం. వివాహ వేడుకలతో పాటు అభిమానులతో ఇంత సన్నిహితంగా గడపడం ద్వారా విజయ్–రష్మిక జంట మరోసారి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. స్టార్ హోదాలో ఉన్నప్పటికీ ఫ్యాన్స్‌తో కలిసి సంబరాలు జరుపుకోవడం వారి అభిమానుల్లో మరింత ఆనందాన్ని నింపింది.