బూర్గంపహాడ్, ఆగస్టు 12 : అడవిలో వన్య ప్రాణులను వేటాడేందుకు విద్యుత్ వైరు అమర్చిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు బూర్గంపహాడ్ ఎస్ఐ మేడా ప్రసాద్ బుధవారం తెలిపారు. మండల పరిధిలోని నకిరిపేట గ్రామ సమీపంలో కొందరు వ్యక్తులు అక్రమంగా అడవి జంతువులను వేటాడేందుకు విద్యుత్ తీగలు అమర్చడంతో అందిన సమాచారం మేరకు పాల్వంచ డీఆర్వో కురుసం అనార్కలీ చెరువుసింగారం వెస్ట్ బీట్ ఆఫీసర్ బానోత్ నవీన్, సిబ్బందితో అక్కడకు వెళ్లి వారి కోసం వెతుకులాడుతుండగా ఎఫ్బీఓ బానోత్ నవీన్ అటవీ జంతువుల కోసం అమర్చిన విద్యుత్ వైరు తగిలి మృత్యువాత పడ్డారని డీఆర్వో ఫిర్యాదు చేశారు. డీఆర్వో ఫిర్యాదు మేరకు లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఆవుల నాగిరెడ్డి, దాసరి నరేశ్, తాటి వీరబాబుపై కేసు నమోదు చేశామని, ఈ కేసును పాల్వంచ సీఐ సతీష్ దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.