పెన్‌పహాడ్, ఆగస్టు 12 : ఇంటి ఆవరణలో లేదా పెరట్లో ఉండే కొద్దిపాటి స్థలంలో మహిళలు సొంతంగా మొక్కలు పెంచుకోవడాన్ని “కిచెన్ గార్డెన్” (పెరటి తోట) వేసుకోవాలని దీనివల్ల కుటుంబానికి తాజా, రసాయనాలు లేని కూరగాయలు లభిస్తాయని పేర్కొంటూ మహిళలకు కిచెన్ గార్డెన్‌పై చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ విద్యార్థులు గడ్డిపల్లి కెవికే శాస్త్రవేత్త సీహెచ్.నరేశ్ మండల పరిధిలోని గాజుల మల్కాపురం గ్రామంలో బుధవారం మహిళలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కిచెన్ గార్డెన్ వల్ల రసాయన మందులు లేని స్వచ్ఛమైన తాజా కూరగాయలు లభిస్తాయని తెలిపారు. కూరగాయల ఖర్చు తగ్గుతుందన్నారు. మొక్కల సంరక్షణ వల్ల మహిళలకు శారీరక శ్రమ, మానసిక ఉల్లాసం లభిస్తాయని తెలిపారు. వంటగదిలోని తడి చెత్తను ఎరువుగా మార్చుకోవచ్చని చెప్పారు. స్థలం లేనివారు సైతం ప్లాస్టిక్ కుండీలు, సిమెంట్ కుండీలు లేదా పాత బకెట్లను కిచెన్ గార్డెన్‌కు ఉపయోగించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో చైతన్య యూనివర్సిటీ విద్యార్ధినులు మానస, భవాని, దివ్య శ్రీ, ప్రణవిత, హస్మిత, కావేరి, దీపిక పాల్గొన్నారు.