Siddipet Jobs | సిద్దిపేట: ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు సిద్దిపేట జిల్లా యంత్రాంగం గుడ్న్యూస్ చెప్పింది. జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) పరిధిలో వివిధ ఆరోగ్య కార్యక్రమాలు, ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 110 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కే. హైమావతి తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 15 నుంచి 25వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
సిద్దిపేట జిల్లాలోని పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాలు, అసంక్రమిక వ్యాధుల నియంత్రణ కార్యక్రమం (NCD), పాలియేటివ్ కేర్, జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ (NUHM), RBSK జిల్లా ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ (DEIC), మొబైల్ హెల్త్ టీమ్స్, తెలంగాణ డయాగ్నోస్టిక్స్ హబ్ తదితర విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ల్యాబ్ టెక్నీషియన్: 4
స్టాఫ్ నర్స్: 40
ANM: 11
ఫార్మసిస్ట్: 10
MLHP / CHO / MO – పల్లె దవాఖాన: 37
ఫిజిషియన్ (MD/MBBS): 2
ఫిజియోథెరపిస్ట్ / ఆక్యుపేషనల్ థెరపిస్ట్: 1
ఆడియాలజిస్ట్ / స్పీచ్ థెరపిస్ట్: 1
ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్: 1
డెంటల్ మెడికల్ ఆఫీసర్: 1
ఆప్టోమెట్రిస్ట్: 1
సైకాలజిస్ట్: 1
మొత్తం ఖాళీలు: 110
అర్హులైన అభ్యర్థులు 2026 సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 25వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు పూర్తిచేసిన దరఖాస్తులను సమర్పించాలి. దరఖాస్తులను సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం (IDOC), దుద్దెడలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం, సిద్దిపేటలో అందజేయాలని అధికారులు తెలిపారు.
పోస్టుల వారీగా విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం, ఇతర నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాలను సిద్దిపేట జిల్లా అధికారిక వెబ్సైట్లోని Recruitment విభాగంలో పరిశీలించాలని జిల్లా కలెక్టర్ కే. హైమావతి సూచించారు.