కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) విదేశాల్లో రహస్యంగా పెళ్లాడింది. ఒడిశాకు చెందిన బీజు జనతాదళ్ (బీజేడీ) సీనియర్ నేత, పూరీ మాజీ ఎంపీ పినాకి మిశ్రాను మే 3న జర్మనీలో ఆమె వివాహం చేసుకున్నట్లు టెలిగ్రాఫ్ పేర్కొంది. సాంప్రదాయ దుస్తులు ధరించి, బంగారు ఆభరణాలతో అందంగా ముస్తాబైన మహువా మొయిత్రా, మిశ్రా చేయిపట్టుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే మహువాతో పాటు టీఎంసీ కూడా ఆమె పెళ్లి గురించి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
కాగా, అస్సాంలో జన్మించిన మహువా మొయిత్రా పెట్టుబడి బ్యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. 2010లో మమతా బెనర్జీ పార్టీలో ఆమె చేరింది. 2019లో పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణనగర్ నియోజకవర్గం నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికైంది. 2024లో మరోసారి విజయం సాధించింది. టీఎంసీ ఫైర్ బ్రాండ్‌గా పేరుగాంచిన మహువా మొయిత్రా పార్లమెంట్ ప్రసంగాలతో జాతీయంగా ప్రాముఖ్యత పొందింది.
మరోవైపు మహువా మొయిత్రా తొలుత డానిష్ ఫైనాన్షియర్ లార్స్ బ్రూర్సెన్ను పెళ్లి చేసుకున్నది. కొంత కాలం తర్వాత వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. అనంతరం న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్‌తో మూడేళ్ల పాటు ఆమె రిలేషన్లో ఉన్నది. అయితే మోసం చేసే మాజీ ప్రేమికుడని ఆమె ఆరోపించింది.
Also Read: