అక్రమ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బయటకు రాకుండా కాంగ్రెస్ సర్కార్ కుట్రలు పన్నుతున్నది. ఇప్పటికే ఆయన కస్టడీ పిటిషన్‌ను మంచిర్యాల కోర్టు కొట్టివేసినప్పటికీ ఎలాగైనా ఆయన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నది. ఈ క్రమంలోనే మంచిర్యాల కోర్టు ఇచ్చిన తీర్పుపై జిల్లా కోర్టులో పోలీసులు అప్పీల్ చేశారు. ఈ కేసు విచారణ ఇవాళ జరగనుంది.
ఈ క్రమంలో ఆదివారం సెలవు అయినా.. జైలులో ఉన్న బాల్క సుమన్‌కు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. మా అడ్వకేట్ చెప్పనిదే నోటీసులు తీసుకోనని సుమన్ చెప్పారు. ఇక పోలీసుల అప్పీల్‌కు సంబంధించి ఇవాళ బెంచ్ మీదకు రానుంది. దీంతో బెయిల్ పిటిషన్‌పై ఇవాళ తీర్పు రాకుండా వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.