Bengaluru Stampede | 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ టైటిల్ను ముద్దాడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కోసం ఏర్పాటు చేసిన విజయోత్సవ కార్యక్రమం తీవ్ర విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల చోటు చేసుకున్న తొక్కిసలాటలో 11 మంది మరణించారు. అయితే, ఈ దుర్ఘటనలో మరణించిన వారి (Victims Of Bengaluru Stampede) వివరాలను అధికారులు తాజాగా వెల్లడించారు.
మరణించిన వారంతా 40 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. 13 ఏళ్ల బాలిక, ముగ్గురు టీనేజర్లు, 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు గల వారు ఆరుగురు ఉన్నారు. మృతులను దివ్యాన్షి (13), దొరేషా (32), భూమిక్ (20), సహానా (25), అక్షత (27), మనోజ్ (33), శ్రవణ్ (20), దేవి (29), శివలింగ (17), చిన్మయి (19), ప్రజ్వల్ (20)గా గుర్తించారు.
Victims2
పద్దెనిమిదేండ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ టైటిల్ని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జట్టును సత్కరించేందుకు కాంగ్రెస్ సారథ్యంలోని కర్ణాటక ప్రభుత్వం బుధవారం నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తీవ్ర విషాదాంతమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల తొక్కిసలాట (Bengaluru stadium stampede) జరిగి 11 మంది మరణించారు. సుమారు 50 మంది గాయపడ్డారు.
ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమని, ముందు జాగత్తగా తగిన ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఆరోపించింది. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన ఈ సన్మాన కార్యక్రమాన్ని వీక్షించేందుకు భారీ స్థాయిలో క్రికెట్ అభిమానులు తరలివచ్చారు. పాసులు, టికెట్లు ఉన్న వారినే లోపలకు అనుమతించాల్సి ఉన్నప్పటికీ తమ ఆర్సీబీ హీరోలను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో స్టేడియం ప్రాంగణం ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయింది. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది.
Also Read..
Harsh Goenka | దేశంలో సామాన్యుడి ప్రాణాలకు విలువ లేదా..? తొక్కిసలాట ఘటనపై హర్ష్ గోయెంకా పోస్ట్
Bengaluru Stampede | పోస్టుమార్టం పేరుతో నా బిడ్డ శరీరాన్ని ముక్కలు చేయకండి.. ఓ తండ్రి ఆవేదన
Stampede | తొక్కిసలాట ఘటన.. సుమోటోగా విచారణకు స్వీకరించిన కర్ణాటక హైకోర్టు