Bengaluru Stampede | రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు విజయోత్సవ సంబురం విషాదాంతమైన విషయం తెలిసిందే. పద్దెనిమిదేండ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ టైటిల్ని గెలుచుకున్న ఆర్సీబీ జట్టును సత్కరించేందుకు కాంగ్రెస్ సారథ్యంలోని కర్ణాటక ప్రభుత్వం బుధవారం నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది మరణించారు. ఈ విషాదంలో కన్నబిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు ఆవేదను గురవుతున్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన తన కుమారుడిని తలచుకోని ఓ తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు.
తనకు ఒక్కగానొక్క కొడుకని.. పోస్టుమార్టం పేరుతో తన బిడ్డ శరీరాన్ని ముక్కలు చేయొద్దంటూ అధికారులను వేడుకుంటున్నారు. ‘నాకు ఒక్కడే కొడుకు. మాకు చెప్పకుండా ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు ఆ బిడ్డను కోల్పోయాను. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి పరామర్శకు వచ్చినా.. చనిపోయిన నా బిడ్డను వారు తిరిగి తీసుకురాలేదు. కనీసం నా బిడ్డ మృతదేహాన్నైనా నాకు అప్పగించండి. పోస్టుమార్టం పేరుతో అతని శరీరాన్ని ముక్కలు చేయొద్దు’ అంటూ అధికారులను వేడుకున్నారు.
పద్దెనిమిదేండ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ టైటిల్ని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జట్టును సత్కరించేందుకు కాంగ్రెస్ సారథ్యంలోని కర్ణాటక ప్రభుత్వం బుధవారం నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తీవ్ర విషాదాంతమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల తొక్కిసలాట (Bengaluru stadium stampede) జరిగి 11 మంది మరణించారు. సుమారు 50 మంది గాయపడ్డారు.
ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమని, ముందు జాగత్తగా తగిన ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఆరోపించింది. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన ఈ సన్మాన కార్యక్రమాన్ని వీక్షించేందుకు భారీ స్థాయిలో క్రికెట్ అభిమానులు తరలివచ్చారు. పాసులు, టికెట్లు ఉన్న వారినే లోపలకు అనుమతించాల్సి ఉన్నప్పటికీ తమ ఆర్సీబీ హీరోలను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో స్టేడియం ప్రాంగణం ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయింది. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది.
Also Read..
Stampede | తొక్కిసలాట ఘటన.. సుమోటోగా విచారణకు స్వీకరించిన కర్ణాటక హైకోర్టు
Corona Virus | డేంజర్ బెల్స్.. ఒక్కరోజే 564 మందికి పాజిటివ్.. 5 నెలల చిన్నారి సహా ఏడుగురు మృతి
Kamal Haasan | హృదయ విదారకం.. తొక్కిసలాట ఘటనపై కమల్ హాసన్