Kamal Haasan | బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాట ఘటనపై తమిళ స్టార్ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ (Kamal Haasan) స్పందించారు. ఈ మేరకు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్ర బాధకు గురిచేసిందన్నారు. ‘బెంగళూరులో జరిగిన ఈ విషాదం హృదయ విదారకం. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అంటూ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
Heart wrenching tragedy in Bangalore. Deeply distressed and my heart reaches out to the families of the victims in this moment of grief. May the injured recover soon.
— Kamal Haasan (@ikamalhaasan) June 4, 2025
కాగా, కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. గత వారం చెన్నైలో నిర్వహించిన ‘థగ్‌లైఫ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో కమల్‌హాసన్ మాట్లాడుతూ.. ‘కన్నడం.. తమిళం నుంచి పుట్టింది’ అని కామెంట్ చేశారు. ఆయన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలపై కన్నడ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఈ వివాదం వేళ.. బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కమల్ స్పందించడం ఆసక్తికరంగా మారింది.
పద్దెనిమిదేండ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ టైటిల్‌ని గెలుచుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టును సత్కరించేందుకు కాంగ్రెస్ సారథ్యంలోని కర్ణాటక ప్రభుత్వం బుధవారం నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తీవ్ర విషాదాంతమైన విషయం తెలిసిందే. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల తొక్కిసలాట (Bengaluru stadium stampede) జరిగి 11 మంది మరణించగా, సుమారు 50 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Also Read..
Virat Kohli | మాటలు రావడం లేదు.. తొక్కిసలాట ఘటనపై కోహ్లీ స్పందన