దండేపల్లి : రాష్ట్రంలో కాంగ్రెస్( Congress ) ప్రభుత్వం రైతు వ్యతిరేకిగా పనిచేస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ రావు ( Vijit Rao) అన్నారు. రైతు భరోసా ఇవ్వాలని కోరుతూ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో శనివారం రైతులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ధర్నా (BRS dharna) నిర్వహించారు. మూడు విడతల రైతు భరోసాను విడుదల చేయాలని డిమాండ్ చేశారు .

కాంగ్రెస్ ప్రభుత్వం మూడు ఎకరాల లోపు మాత్రమే ఇచ్చి మిగతా రైతులకు అన్యాయం చేసిందన్నారు. ఎగ్గొట్టిన రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ చేయాలన్నారు. అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యే నాటికి రైతు భరోసా పూర్తిగా విడుదల చేయాలని లేని పక్షంలో నియోజకవర్గ రైతులతో కలిసి కలెక్టరేట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. రైతులకు అన్యాయం జరిగితే బిఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని, రైతుల కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తిప్పని లింగయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు చుంచు శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ అనిల్, పీఎసీఎస్ మాజీ చైర్మన్, వైస్ చైర్మన్ కాసనగొట్టు లింగన్న, అక్కల రవీందర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గొల్ల రాజమల్లు, ముద్దసాని తిరుపతి, ఆశెట్టి వెంకటరమణ, గొల్లపెల్లి అజయ్, అల్లంల సంతోష్, ఇసాకర్,నజీర్ భూమన్న, మల్లయ్య, పత్తిపాక శ్రీనివాస్, ఇప్ప సాయి, హరీష్, రాకేష్, తిరుపతి, ఇస్మాయిల్, స్వామి గౌడ్, కుమార్, తదితరులు ఉన్నారు.