కరీంనగర్ ముకరంపుర, జూలై 25: వర్షాభావంతో పంటలకు నీరందక రైతులు ఆగమవుతున్న టైంలో కరీంనగర శివారులోని ఓ మహిళా రైతుకు చెందిన బోరుబావికి విద్యుత్తు సరఫరా నిలిపివేయడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళి తే.. కరీంనగర్ పరిధిలోని గోపాల్‌పూర్‌కు చెందిన మేడిద పుష్పలతకు రెండెకరాల భూమి ఉంది. 12 ఏండ్లుగా బోరుబావి నీళ్లతో పంటలు సాగుచేస్తున్నారు. విద్యుత్తు స్తంభాలు రోడ్డుకు ఇబ్బందిగా ఉండటంతో స్థానిక రైతుల ఆమోదంతో ఒర్రె నుంచి కొత్తగా లైన్‌ను సొంత ఖర్చులతో పుష్పలత వేసుకున్నారు.
నెల రోజుల క్రితం విద్యుత్తు సిబ్బంది వచ్చి కనెక్షన్ తొలగించి, సరఫరా నిలిపివేశారు. దీంతో పుష్పలత సబ్ డివిజన్ అధికారిని కలిసి విన్నవించగా, తిరిగి విద్యుత్తు సరఫరా ఇచ్చారు. దీంతో ఎకరంలో పత్తి, మరో ఎకరంలో కూరగాయ లు సాగు చేయగా మూడు రోజుల క్రితం స్థానిక విద్యుత్తు సిబ్బంది మరోసారి విద్యు త్తు సరఫరా నిలిపివేశారు. ఈ విషయాన్ని ఎస్ఈ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే సరఫరా ఇవ్వాలని అధికారులను ఆదేశించినా సిబ్బంది పట్టించుకోలేదు.