హైదరాబాద్, జులై 15 (నమస్తే తెలంగాణ)ః ఫిజికల్ ఫిట్నెస్ శరీరం, మనస్సు మధ్య సరైన సమతుల్యతను సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ అన్నాడు. ఆదాయపు పన్ను శాఖ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ సంజీవయ్య పార్కు వద్ద నిర్వహించిన వాకథాన్కు ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకాంత్ మాట్లాడుతూ ఫిట్ నెస్ మనిషిలో పట్టుదల, ఏకాగ్రత,గెలుపు అనే దృక్పథాన్ని పెంపొందిస్తుందని అభిప్రాయపడ్డాడు. ఆదాయపు పన్ను శాఖ ముఖ్య కమిషనర్ సురేష్ బత్తిని మాట్లాడుతూ ఆధునిక పని వాతావరణంలో ఎదురవుతున్న ఆరోగ్య సవాళ్లను ఎదురొనేందుకు ప్రతి ఒకరూ రోజూ వ్యాయామం చేస్తూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. వాకథాన్ తో ఆరోగ్యానికే పరిమితం కాకుండా ఈ సమాజంలో పర్యావరణ పరిరక్షణపై కూడా సురేష్ అవగాహన కల్పించారు.