ఒంటారియో (కెనడా): భారత యువ స్క్వాష్ సంచలనం అనాహత్ సింగ్ కొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ స్క్వాష్ జూనియర్ చాంపియన్‌గా నిలిచిన భారత తొలి ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది. శనివారం రాత్రి జరిగిన మహిళల ఫైనల్లో టాప్ సీడ్, 20వ ర్యాంకర్ అనాహత్ 11-3, 11-7, 11-9 తేడాతో వరుస గేమ్స్‌లో ఈజిప్ట్‌కు చెందిన రుకయా సలేమ్‌ను చిత్తు చేసింది. గతేడాది సెమీ ఫైనల్ వరకు వచ్చి కాంస్యంతో సరిపెట్టుకున్న 18 ఏండ్ల భారత అమ్మాయి ఈసారి స్వర్ణంతో సత్తా చాటింది.