హైదరాబాద్, ఆట ప్రతినిధి: సికింద్రాబాద్ క్లబ్ జీఎంఆర్ స్పోర్ట్స్ యూత్ ఓపెన్ రెగట్టా టోర్నమెంట్లో ఆతిథ్య సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ (ఎస్ఎస్సీ), తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్ (టీఎస్ఏ) క్రీడాకారులు సత్తా చాటారు. శనివారం ముగిసిన ఆప్టిమిస్ట్ గ్రీన్ బాలికల్లో టీఎస్సీకి చెందిన ఎన్. సింధు చాంపియన్గా నిలవగా.. డి. ఆన్య రెడ్డి (ఎస్ఎస్సీ) రజతం, రోషిణి కశ్యప్ (టీఎస్ఏ) కాంస్యం అందుకున్నారు. బాయ్స్లో యువరాజ్ సిరోహి (టీఎస్సీ) టాప్ ప్లేస్ సొంతం చేసుకున్నాడు.