Virat Kohli | పద్దెనిమిదేండ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ టైటిల్‌ని గెలుచుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టును సత్కరించేందుకు కాంగ్రెస్ సారథ్యంలోని కర్ణాటక ప్రభుత్వం బుధవారం నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తీవ్ర విషాదాంతమైన విషయం తెలిసిందే. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల తొక్కిసలాట (stampede) జరిగి 11 మంది మరణించగా, సుమారు 50 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ఆర్సీబీ జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) సైతం విషాద ఘటనపై స్పందించారు. ఈ మేరకు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘మాటలు రావడం లేదు. తీవ్ర మనోవేదనకు గురయ్యాను’ అంటూ పేర్కొన్నారు. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా పోస్టు పెట్టారు. మరోవైపు ఈ విషాద ఘటనపై ఆర్సీబీ (RCB) యాజమాన్యం సైతం అధికారిక ప్రకటన విడుదల చేసింది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేసింది. ప్రతి ఒక్కరి భద్రత, శ్రేయస్సే మాకు అత్యంత ముఖ్యం అని పేర్కొంది.
Also Read..
భారత నెట్‌బాల్ జట్టుకు లితిశ, యశశ్రీ