హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఈనెల 5 నుంచి 8వ తేదీ వరకు జరిగే హంకాంగ్ కప్ 2025 టోర్నీలో పోటీపడే భారత నెట్‌బాల్ జట్టుకు తెలంగాణ నుంచి గౌరి లితిశ, యెరువా యశశ్రీ ఎంపికయ్యారు. జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న వీరిద్దరు భారత్ తరఫున బరిలోకి దిగనున్నారు. వీరితో పాటు రాష్ట్ర నెట్‌బాల్ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు విక్రమ్ఆదిత్యారెడ్డి భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించనున్నాడు. రాష్ట్రం నుంచి ఇద్దరు ప్లేయర్లతో పాటు కోచ్ ఎంపిక కావడం ఇదే తొలిసారి అని అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.