హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): జాతీయ రాజకీయాల్లో క్రియాశీలంగా అడుగులు వేసిన కేసీఆర్, కేజ్రీవాల్‌ను దెబ్బతీసేందుకే బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ మద్యం కేసు బనాయించిందని కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్ ఆరోపించారు.
సీబీఐ ట్రయల్ కోర్టు తీర్పుతో బీజేపీ కుట్రలు పటాపంచలయ్యాయని స్పష్టంచేశారు.