ముంబై: క్రికెట్ అభిమానులకు శుభవార్త! టీ20 ప్రపంచకప్ టోర్నీతో ఎంజాయ్ చేస్తున్న అభిమానులను మండు వేసవిలో మజా అందించేందుకు ఐపీఎల్ రాబోతున్నది. మార్చి 28 నుంచి ఐపీఎల్ 19వ సీజన్ మొదలయ్యే అవకాశముంది. వాస్తవానికి మార్చి 26 నుంచే మొదలుకావాల్సి ఉన్నా..పశ్చిమబెంగాల్, తమిళనాడు, అసోం, కేరళ రాష్ర్టాల్లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ రెండు రోజులు ఆలస్యంగా లీగ్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నది.
దీనికి తోడు ఈ మూడు రాష్ర్టాల్లో ఎన్నికల తేదీలను అనుసరించి ఒకేసారి పూర్తి షెడ్యూల్ కాకుండా రెండు దశల్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు బోర్డు వర్గాలు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.
కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్‌లు ఈడెన్‌గార్డెన్స్‌లో సీఎస్కే మ్యాచ్‌లు చెన్నైలో, రాజస్థాన్ తమ రెండో వేదికగా గువాహటిని ఎంచుకున్న నేపథ్యంలో షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశముంది. ఇదిలా ఉంటే బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణపై ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇచ్చినా..రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) హోంగ్రౌండ్పై స్పష్టత రావాల్సి ఉంది.