Stampede | ఐపీఎల్ 2025 టైటిల్ను గెలుచుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు సత్కార కార్యక్రమం విషాదాంతమైన విషయం తెలిసిందే. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల తొక్కిసలాట (Bengaluru stadium stampede) జరిగి 11 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. ఈ తొక్కిసలాట ఘటనను కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) సుమోటోగా విచారణకు స్వీకరించింది. మధ్యాహ్నం 2:30 గంటలకు కేసుపై కోర్టు విచారించనుంది.
పద్దెనిమిదేండ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ టైటిల్ని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జట్టును సత్కరించేందుకు కాంగ్రెస్ సారథ్యంలోని కర్ణాటక ప్రభుత్వం బుధవారం నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తీవ్ర విషాదాంతమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల తొక్కిసలాట (Bengaluru stadium stampede) జరిగి 11 మంది మరణించారు. సుమారు 50 మంది గాయపడ్డారు.
ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమని, ముందు జాగత్తగా తగిన ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఆరోపించింది. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన ఈ సన్మాన కార్యక్రమాన్ని వీక్షించేందుకు భారీ స్థాయిలో క్రికెట్ అభిమానులు తరలివచ్చారు. పాసులు, టికెట్లు ఉన్న వారినే లోపలకు అనుమతించాల్సి ఉన్నప్పటికీ తమ ఆర్సీబీ హీరోలను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో స్టేడియం ప్రాంగణం ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయింది. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది.
Also Read..
Virat Kohli | మాటలు రావడం లేదు.. తొక్కిసలాట ఘటనపై కోహ్లీ స్పందన
Corona Virus | డేంజర్ బెల్స్.. ఒక్కరోజే 564 మందికి పాజిటివ్.. 5 నెలల చిన్నారి సహా ఏడుగురు మృతి