Harsh Goenka | ఆర్సీబీ (RCB) విజయోత్సవ సంబురంలో తొక్కిసలాట జరిగిన 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమని, ముందు జాగత్తగా తగిన ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ ఘటనపై పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తొక్కిసలాట ఘటనపై ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా (Harsh Goenka) స్పందించారు. గతంలో చోటు చేసుకున్న మేజర్ తొక్కిసలాట ఘటనలను ప్రస్తావిస్తూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. మన దేశంలో సామాన్యుడి ప్రాణాలకు విలువ లేదా..? అంటూ ప్రశ్నించారు.
‘ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట. కుంభమేళాలో తొక్కిసలాట. బెంగళూరు ఐపీఎల్ విజయోత్సవంలో తొక్కిసలాట. ఆయా ఘటనల్లో డజన్ల కొద్దీ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కానీ, ఇంతవరకూ ఎవరూ బాధ్యత తీసుకోలేదు. రాజీనామాలూ లేవు. జవాబుదారీతనం లేదు. పాఠాలూ నేర్చుకోలేదు. భారతదేశంలో సామాన్యుడి జీవితం అమూల్యమైనది కాదా..? విలువలేదా..? వారి ప్రాణం విలువ ఒక కప్పు చాయ్ కంటే చౌకగా మారింది..! ఇలాంటి ఘటనల తర్వాత అంతా యథావిధిగా సాగుతోంది. ఏమీ మారట్లేదు’ అంటూ ఎక్స్ పోస్టులో రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌కు హృదయం ముక్కలైన ఎమోజీని జత చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
Delhi station stampede. Kumbh stampede. Bangalore IPL stampede.
Dozens die. No resignations. No accountability. No lessons.In India, the life of a common man isn’t priceless- it’s worthless.
Cheaper than a cup of chai!Business will go on as usual.Nothing will change. 💔
— Harsh Goenka (@hvgoenka) June 4, 2025
పద్దెనిమిదేండ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ టైటిల్‌ని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జట్టును సత్కరించేందుకు కాంగ్రెస్ సారథ్యంలోని కర్ణాటక ప్రభుత్వం బుధవారం నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తీవ్ర విషాదాంతమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల తొక్కిసలాట (Bengaluru stadium stampede) జరిగి 11 మంది మరణించారు. సుమారు 50 మంది గాయపడ్డారు.
ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమని, ముందు జాగత్తగా తగిన ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఆరోపించింది. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన ఈ సన్మాన కార్యక్రమాన్ని వీక్షించేందుకు భారీ స్థాయిలో క్రికెట్ అభిమానులు తరలివచ్చారు. పాసులు, టికెట్లు ఉన్న వారినే లోపలకు అనుమతించాల్సి ఉన్నప్పటికీ తమ ఆర్సీబీ హీరోలను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో స్టేడియం ప్రాంగణం ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయింది. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది.
Also Read..
Bengaluru Stampede | పోస్టుమార్టం పేరుతో నా బిడ్డ శరీరాన్ని ముక్కలు చేయకండి.. ఓ తండ్రి ఆవేదన
Stampede | తొక్కిసలాట ఘటన.. సుమోటోగా విచారణకు స్వీకరించిన కర్ణాటక హైకోర్టు
Corona Virus | డేంజర్ బెల్స్.. ఒక్కరోజే 564 మందికి పాజిటివ్.. 5 నెలల చిన్నారి సహా ఏడుగురు మృతి