హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లో సింథటిక్ డ్రగ్స్ తయారీ ముఠా గుట్టురట్టు అయ్యింది. షాద్‌నగర్ కేంద్రంగా మెఫెడ్రిన్ డ్రగ్ తయారుచేస్తున్న ఎస్ఆర్ ఇన్నోవేషన్స్ కంపెనీపై రాష్ట్ర ఈగల్ ఫోర్స్ ఇటీవల దాడులు నిర్వహించింది.
ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లలో నిషేధిత కెమికల్స్ రా మెటీరియల్‌ను విక్రయిస్తున్నట్టు గుర్తించింది. రాజస్థాన్‌కు చెందిన వీరేంద్రస్వామి అలియాస్ గిరీశ్ తాపర్, మనీశ్ బిష్ణోయ్‌లను అరెస్ట్ చేసింది. ఈ మేరకు కేసు వివరాలను ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య ఆదివారం వెల్లడించారు. ఈ వ్యవహారంలో వీరేందర్, మనీశ్‌ను ప్రధాన సూత్రధారులుగా గుర్తించినట్టు చెప్పారు.