Commonwealth Games | ట్రిపుల్ జంపులో డబుల్ బొనాంజా.. డెకాథ్లాన్‌లో తొలి పతకం..!
ట్రిపుల్ జంప్ క్వాలిఫయింగ్‌లో మెరిసిన ప్రవీణ్ చిత్రవేల్ (Praveen Chithravel), సెల్వ ప్రభు తిరుమరన్ (Selva Prabhu Tirumaran)లు ఫైనల్లోనూ సత్తా చాటి పతకాలు సాధించారు.
Commonwealth Games : కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు అదరగొట్టారు. ట్రిపుల్ జంప్ క్వాలిఫయింగ్‌లో మెరిసిన ప్రవీణ్ చిత్రవేల్ (Praveen Chithravel), సెల్వ ప్రభు తిరుమరన్ (Selva Prabhu Tirumaran)లు ఫైనల్లోనూ సత్తా చాటి పతకాలు సాధించారు. శనివారం జరిగిన ఫైనల్లో ప్రవీణ్ 16.58 మీటర్లు, సెల్వ 16.52 మీటర్ల దూరం దూకి వరసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. డెకథ్లాన్లో దేశానికి మొట్ట మొదటి పతకం అందించాడు తేజస్విన్ శంకర్ (Tejaswin Shankar). పోడియం మీద ఈ ముగ్గురూ సగర్వంగా పతకాలు స్వీకరించి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు.
గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు పదో రోజు కూడా పతకాల వేట కొనసాగించారు. బాక్సర్లు ప్రీతి పవర్, జాస్మినె లంబోరియాలు స్వర్ణాలు అందించగా.. ట్రిపుల్ జంప్‌లో ప్రవీణ్ చిత్రవేల్ రజతం, సెల్వ ప్రభు కాంస్యంతో మెరిశారు.
𝐓𝐢𝐦𝐞 𝐭𝐨 𝐠𝐨 𝐭𝐡𝐞 𝐝𝐢𝐬𝐭𝐚𝐧𝐜𝐞! 💥
Don’t miss Praveen Chithravel and Selva Prabhu in the Men’s Triple Jump Final at Glasgow 2026.
TODAY | 2:40 PM
LIVE & EXCLUSIVE on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #SonyLIV #Glasgow2026… pic.twitter.com/CydB41uabw— Sony Sports Network (@SonySportsNetwk) August 1, 2026
ఉత్కంఠగా సాగిన ఫైనల్లో ప్రవీణ్ ప్రవీణ్ 16.58 మీటర్లు, సెల్వ 16.52 మీటర్ల దూరంతో వరసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. మొదట 16.05 మీటర్లు దూకిన ప్రవీణ్.. నాలుగో ప్రయత్నంలో 16.58 మీటర్ల మార్క్ అందుకున్నాడు. సెల్వ సైతం 15.87 మీటర్ల నుంచి.. నాలుగో ప్రయత్నంలో 16.52 మీటర్ల దూరంతో కాంస్యం గెలిచాడు.
7,976 పాయింట్లు
ఇక పది క్రీడల డెకాథ్లాన్ పోటీల్లో తేజస్విన్ శంకర్ దేశానికి మొట్టమొదటి పతకం అందించాడు. పురుషుల 110 మీటర్ల హర్డిల్స్, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, హై జంప్, షాట్‌పుట్, డిస్కస్ త్రో, 400 మీటర్లు, జావెలిన్ త్రో, పోల్ వాల్ట్, 1500 మీటర్ల పరుగులో సత్తా చాటిన తేజస్విన్ 7,976 పాయింట్లు సాధించి, కాంస్యంతో యావత్ దేశం గర్వపడేలా చేశాడు. గాయం బాధించినా సరే దేశం కోసం పతకం గెలవాలనే కసితో పోటీపడిన తేజస్వీపై ప్రశంసలు కురుస్తున్నాయి.
SOME MEDALS FEELS PERSONAL, THIS IS ONE OF THEM 🥉🥹
Despite his injuries, Tejaswin Shankar won India’s first-ever decathlon medal in Commonwealth Games history! 🇮🇳
Thanks @TejaswinShankar 🙏 pic.twitter.com/y70OBSAbCl
— The Khel India (@TheKhelIndia) August 1, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

