హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ) : భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో రాష్ట్ర యూనివర్సిటీల కన్వెన్షన్ ఈనెల 17,18 తేదీల్లో నిర్వహించనున్నట్టు రాష్ట్ర అధ్యక్షుడు శనిగరపు రజినీకాంత్ తెలిపారు. ఆదివారం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యాలయంలో పోస్టర్ ఆవిషరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర యూనివర్సిటీల కన్వెన్షన్ రెండు రోజులపాటు పాలమూరు యూనివర్సిటీలో జరుగుతుందని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ యూనివర్సిటీల నుంచి 200 మంది ప్రతినిధులు హాజరుకానున్నట్టు వెల్లడించారు. 17న విద్యార్థి ప్రదర్శన బహిరంగ సభ ఉంటుందని తెలిపారు.