Excise Duty | ఆ తగ్గింపు వినియోగదారులకు కాదు.. కంపెనీలకు మాత్రమే..!
Excise Duty | కేంద్ర ప్రభుత్వం (Union Govt) పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీ (Excise Duty) తగ్గించినా వాహనదారులకు ఎలాంటి ఊరట లభించలేదు. పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ఇవాళ ఉదయం కేంద్రం ప్రకటించింది. అయితే ఈ తగ్గింపు ప్రయోజనం వినియోగదారులకు చేరదని, రిటైల్ ధరలు యథాతథంగా కొనసాగుతాయని తెలిపింది.
Excise Duty : కేంద్ర ప్రభుత్వం (Union Govt) పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీ (Excise Duty) తగ్గించినా వాహనదారులకు ఎలాంటి ఊరట లభించలేదు. పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ఇవాళ ఉదయం కేంద్రం ప్రకటించింది. అయితే ఈ తగ్గింపు ప్రయోజనం వినియోగదారులకు చేరదని, రిటైల్ ధరలు యథాతథంగా కొనసాగుతాయని తెలిపింది. ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎదుర్కొంటున్న భారీ నష్టాలను భర్తీ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రస్తుత అంతర్జాతీయ ధరల ప్రకారం.. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి సంస్థలు లీటర్ పెట్రోల్‌పై సుమారు రూ.26, లీటర్ డీజిల్‌పై రూ.81.90 చొప్పున నష్టపోతున్నాయి. ఈ కంపెనీలు రోజుకు మొత్తంగా రూ.2,400 కోట్ల నష్టాన్ని భరిస్తున్నాయని మంత్రిత్వ శాఖ వివరించింది. తాజాగా తగ్గించిన రూ.10 ఎక్సైజ్ సుంకం ఈ నష్టాల్లో కొంత భాగాన్ని భర్తీ చేస్తుందని, దీనివల్ల సరఫరాకు అంతరాయం కలుగకుండా చూసుకోవచ్చని పేర్కొన్నది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా గత నెల రోజుల్లోనే అంతర్జాతీయంగా ముడి చమురు ధర బ్యారెల్‌కు 70 డాలర్ల నుంచి 122 డాలర్లకు అంటే ఏకంగా 75 శాతం పెరిగిందని ప్రభుత్వం తెలిపింది. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇంధన ధరలు 20 శాతం నుంచి 50 శాతం వరకు పెరిగినా.. భారత్‌లో మాత్రం ధరలను స్థిరంగా ఉంచామని పేర్కొన్నది. సామాన్య పౌరులను కాపాడేందుకే ప్రధాని మోదీ ప్రభుత్వ ఆదాయాన్ని వదులుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Diesel
- excise duty
- India
- Petrol
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

