Yami Gautam | భర్త సినిమాను ప్రేక్షకుల మధ్య చూసిన యామీ గౌతమ్.. తన సీన్ రాగానే సిగ్గుతో ముఖం దాచుకున్న నటి!
Yami Gautam | బాలీవుడ్ నటి యామీ గౌతమ్ తన భర్త ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ చిత్రం 'ధురంధర్ 2: ది రివెంజ్' సక్సెస్‌ను సాధారణ ప్రేక్షకుల మధ్య ఎంజాయ్ చేశారు.
Yami Gautam | బాలీవుడ్ నటి యామీ గౌతమ్ తన భర్త ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ చిత్రం ‘ధురంధర్ 2: ది రివెంజ్’ సక్సెస్‌ను సాధారణ ప్రేక్షకుల మధ్య ఎంజాయ్ చేశారు. మార్చి 19న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల క్లబ్లో చేరి సంచలనం సృష్టిస్తున్న తరుణంలో, యామీ ముంబైలోని ఒక రద్దీగా ఉన్న థియేటర్లో సినిమా చూస్తూ కనిపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన సోదరి సురిలీ గౌతమ్‌తో కలిసి హౌస్‌ఫుల్ థియేటర్‌కు వెళ్లిన ఆమె, ప్రేక్షకులు తనను గుర్తుపట్టకుండా ఉండేందుకు ముఖాన్ని దాచుకుంటూ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఈ చిత్రంలో ఆమె చేసిన ‘నర్సు’ కామియో రోల్ తెరపై రాగానే పక్కనే ఉన్న సోదరి వీడియో తీయడం మొదలుపెట్టడంతో, యామీ ఒక్కసారిగా సిగ్గుపడిపోయారు. ఆ సమయంలో తన ముఖాన్ని కవర్ చేసుకుంటూ సోదరిని వారించిన దృశ్యాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ స్పై థ్రిల్లర్‌లో సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ వంటి అగ్ర నటులు నటించగా, 2026లో ఇది అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ విజయంపై స్పందిస్తూ సురిలీ గౌతమ్ తన సోదరిని ‘లక్కీ ఛార్మ్’ అని అభివర్ణించగా, యామీ తన ఆనందాన్ని పంచుకున్నారు. ప్రేక్షకుల మధ్యే ఉండి కూడా ఎవరూ గుర్తుపట్టకుండా సినిమాను ఎంజాయ్ చేసిన యామీ గౌతమ్ సరదా వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది.
She is caught red-handed ⚠️⚠️⚠️⚠️⚠️#YamiGautam caught secretly watching #Dhurandhar2 in a packed theatre.🔴🔴
Watch 👇@yamigautam was seen watching her cameo in #Dhurandhar2TheRevenge in a packed theatre, with her sister Surilie Gautam. The actor appeared shy, hiding her… pic.twitter.com/o5cKZyeEVu
— Always Bollywood (@AlwaysBollywood) March 27, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. 8 రోజుల్లోనే రూ. 400 కోట్లు!
High Blood Pressure | రక్తపోటు అదుపులోకి రావడం లేదా? అసలు కారణాలు ఇవే..
Ranabaali | ‘రణబాలి’కి టికెట్ ధరలే ప్లస్ పాయింట్.. ‘జైలర్ 2’తో పోటీలో విజయ్ దేవరకొండకు కలిసొచ్చే అంశమిదే!
Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

